యోగ సూక్తులు


  • ఆధ్యాత్మిక వికాసానికి యమ– నియమాలు అవసరం! 

  • మనిషిని పతనావస్థకు చేర్చేది అహంకారం! 

  • ధనం, అధికారం, కీర్తి ప్రతిష్టలు అహంకారాన్ని కలిగిస్తాయి! 

  • మాయా అంటే కనకము, కాంతములే! 

  • ఆశే మాయకు మూలం!

  • దయ కలిగి ఉండుట మోక్ష మార్గ ద్వారం! 

  • మమకారం మోక్షద్వార బంధనం! 

  • “నేను”అనేది తెలుసుకోవడం యోగానికి మూలం!

  • నీ గురించి నీవు మర్చిపోవటం సమాధి స్థితి! 

  • నేను ఎవరో నాకు తెలియాలి అనుకోవడం జ్ఞాన సాధనకు తొలిమెట్టు!

  • నీ గురించి నీవు తెలుసుకోవడం ఆత్మజ్ఞానం! 

  • మనసు యొక్క తత్త్వమును తెలుసుకొనుట తత్వ జ్ఞానము! 

  • జపము, ఉపాసన, ప్రాణాయామము, ధ్యానము, తపస్సు అనేవి పంచ సాధనలు!

  • విషయ వాంఛలకు దూరం అవ్వటం వైరాగ్యం!

  • విషయ వాసనలకు దూరం అవటం పునః జర్మరహితం! 

  • త్రిగుణాలకు లోబడి పని చేయటం “కర్మ “అవుతుంది!

  • త్రిగుణ రహితంగా ఉండటం కర్మ నివృత్తి! అదే కర్మ సన్యాసం! 

  • విషయ వాసనలకు లోబడినవాడు భోగి! 

  • విషయ వాసనారహితంగా ఉన్నవాడు యోగి! 

  • ధ్యానములో మనసు పని చేయకపోవటం సమాధి స్థితి! 

  • మనసు–బుద్ధి లోనికి లయము అవడం – సంప్రజ్ఞాత సమాధి! 

  • బుద్ధి–అహంకారములో లయం చెందటం–అసంప్రజ్ఞాత సమాధి!

  • అహంకారము ఆత్మ యందు లయం చెందటం –నిర్వికల్ప సమాధి!

  • శుద్ధ ఆత్మ– పరమాత్మ యందు లయం చెందటం – ముక్తి!

  • ఆలోచనలను శుద్ధి చేయుట ధ్యానము! 

  • నిరంతరము ధ్యానం చేయుట తపస్సు! 

  • మనసును శుద్ధి చేయుట పూజ! 

  • శరీర నాడులను శుద్ధి చేయుట ప్రాణాయామము! 

  • మనసును ఆధీనం చేసుకొనుట జపము! 

  • ఆధీరమైన మనసును స్థిరము చేసుకొనుట ఉపాసన! 

  • శరీరము లేకుండా, అశరీరవాణితో ఇష్టదేవత దర్శనం ఇవ్వడం– దైవ దర్శనం!

  • సశరీరంలో ఇష్ట దేవతా సాక్షాత్కరించడం– దైవసాక్షాత్కారం! 

  • భ్రుకుటి స్థానంలో జ్యోతి బిందువు దర్శనం– ఆత్మ దర్శనం!

  • శుద్ధమైన ఆత్మయందు పరమాత్మ ప్రకాశం అనగా సత్ జ్యోతి స్వరూప దర్శనం –పరమాత్మ సాక్షాత్కారం!

  • సత్ జ్యోతి బిందువులో తన స్వస్వరూపాన్ని చూడటం –ఆత్మసాక్షాత్కారం.!

  • సహస్ర చక్రములోని వెయ్యి దళాలు వికాసం చెందటం – విశ్వరూప సాక్షాత్కారం!

  • కారణ దేహమునకు విస్తారత పెరగటం– విశ్వరూప దర్శనం చూపటం!

  • తత్వమసి అంటే సృష్టి అంతా నువ్వే అయి ఉన్నావని అర్థం! 

  • అహం బ్రహ్మాస్మి అంటే నేనే పరబ్రహ్మాన్ని అర్థం! 

  • నేను కానిది ఏదీ లేదు అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం! 

  • కోపం జయించడానికి ఓర్పుని ఆశ్రయించు! 

  • ఆశని జయించడానికి తృప్తిని ఆశ్రయించు! 

  • అహాన్ని జయించడానికి సేవలను ఆశ్రయించు! 

  • నీ శరీరంతోనే నీ శరీరంలోని దైవాన్ని వెతుకు! ఇదే యోగసాధకుడి లక్ష్యం! 

  • అన్ని భయాల నుండి రక్షించేది మంత్రమే!

  • తినుట కొరకు జీవించువాడు జీవుడు! 

  • జీవించుట కొరకు తిను వాడు ముక్తుడు! 

  • త్యాగం వల్లే శాంతి లభిస్తుంది! 

  • కర్మఫల త్యాగం వల్ల పరమ శాంతి లభిస్తుంది! 

  • అవసరమైంది అవసరమైనప్పుడు ఇవ్వడం ప్రకృతి లక్షణం! 

  • నిద్ర కోసం పరుండేవాడు సంసారి! 

  • నిద్ర వచ్చినప్పుడు పరుండేవాడు సన్యాసి!

  • ధ్యానం మానవుడిని మాధవుడిగా చేస్తుంది!

  • ధ్యానం అంటే కుండలినీ శక్తిని సుషుమ్న మార్గంలోనికి ప్రయాణింప చేయటం!

  • దేవుడికి, మనిషికి మధ్య ఉన్న ఏకైక సన్నని పొర అహంభావం! 

  • నిద్ర, మెలకువ, కాల కృత్యాల అనంతరం లింగాభిషేకం, ధ్యానం, ఆహారం, నిద్ర ఇవే యోగ సాధకుడి దినచర్య! 

  • ధ్యానంలో ఒక అడుగు భూమి పైకి లేవటం– మూలాధార చక్ర ఆధీనమునకు గుర్తు! 

  • ఇవ్వడం – దయా స్వభావం!

  • తీసుకోవటం –  మాయా స్వభావం!

  • మంచికి, చెడుకి – మనసే కారణం! 

  • మోక్షం ఉన్నచోట సంసారిక సుఖాలు ఉండవు! భోగలాలస ఉన్నచోట మోక్షం లేదు! 

  • మన ప్రారబ్ద కర్మలను బట్టి మనం ఎప్పుడు ఎలా ఎక్కడ మరణిస్తామో ముందే నిశ్చయమై ఉంటుంది!

  • సుషుమ్న నాడీ మార్గమునే కుండలినీ అందురు.

  • శరీరంలోని ప్రాణశక్తియే కుండలినీ శక్తి!

  • శరీరం నుండి ఆత్మ బయటికి పోవడమే మరణం! 

  • స్థూల, సూక్ష్మ, కారణా శరీరాలను విశ్వశక్తితో నింపి వేయడమే యోగ సాధన! 

  • పునః జన్మలు లేకుండా చేసుకోవడమే ముక్తి!

  • జీవాత్మ ఆత్మ అని తెలుసుకొనుట ఆత్మ అనుభూతి!

  • పరిశుద్ధ ఆత్మ విశ్వాత్మమని తెలుసుకొనుట పరబ్రహ్మనుభూతి!

  • అహంకారానికి విరుగుడు ఓంకారం! 

  • భోగం –పాపం ,భక్తి –పుణ్యం!

  • ఆత్మకు జీవాత్మకు గల సన్నటి పొర అహంకారం! 

  • పరమాత్మకు ,ఆత్మకు గల సన్నటి పొర “నేను” అనేది!

  • నేను అనేది నశించుట పరమానందమునకు మూలము! 

  • నేను కానిది ఏదీ లేదు లేదా అంతా నేనే– తనకి భిన్నంగా ఏం లేదు అనుకోవడం ఆత్మ దర్శనానుభూతి 

  • దుఃఖించే సాధకుడు సాధకుడు కాడు! 

  • మానసిక, శారీరక కర్మలే సంసారము! 

  • అహంకారము, గర్వములను విడిచినచో ఆధ్యాత్మికముగా ముందుకు పోగలవు!

  • సిద్దులను ధనార్జన కోసము, స్వార్థం కోసము, కీర్తి ప్రతిష్టల కోసం వాడితే వారు యోగ భ్రష్టులవుతారు!

  • మనలను రక్షించువాడు , ఆఖరికి మరణమును ఇచ్చువాడు దేవుడొక్కడే! 

  • మనసు నిలకడగా లేనిచో , అది దేవుడి యందు పూర్తిగా లీనమైనట్లు కాదు! 

  • పరిశుద్ధమైన హృదయమునందు మాత్రమే వివేకం, వైరాగ్యం కలిగి ఆత్మసాక్షాత్కారం కలుగును! 

  • మనసులో రవ్వంత లోభం ఉన్నా ఆధ్యాత్మిక సాధనలన్నియు వ్యర్థమవును.

  • విడవకుండా ధ్యానం చేసినచో ఆలోచనలు నశించును! 

  • ఈర్ష్యను జయించినచో సంతోషంగా ఉండగలవు!

  • ధనము కలిగినప్పుడు వినయము నేర్చుకోవలెను! 

  • నేనెవరిని అనే విషయం ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండు !ఇదే ముముక్షువు లక్షణం!

  • సంతోషము దుఃఖము – ఇవి మనసులో కలిగే భ్రమలు మాత్రమే!

  • కామ – క్రోధముల కలయికయే ఈ సంసారం అని గుర్తుంచుకోండి!

  • కోరిక అనేది మానసిక బలమును ,నిశ్చలతను భంగపరుచును! 

  • ప్రాపంచిక సంతోషం నిజమైన సంతోషం కాదు! 

  • ముక్తి ఒక్కటే నిజమైన ఆనందం ,నిజమైన సంతోషం! 

  • ఏం బంధం లేనిదే ఎవరు ఎక్కడకు వెళ్ళరు ,వెళ్ళలేరు! 

  • దైవ సంకల్పం లేనిదే ఎవరూ మనల్ని కలవలేరు! 

  • స్త్రీ ,సంపద అనే రెండు ఆధ్యాత్మిక జీవితంలో వచ్చే పెద్ద అడ్డంకులు!

  • ప్రేమతో నిండిన భక్తి ఉత్తమమైనది! అదే అనన్య భక్తి!

  • మనం ఎప్పుడూ సూటిగా , నీతిగా పవిత్రంగా ఉండాలి!

  • ప్రారబ్ధ కర్మలను అనుభవించనిదే శరీరం నుంచి ఆత్మకు విముక్తి లేదు!

  • యోగము ,త్యాగము, జ్ఞానము, అనన్య భక్తి – ఇవి భగవంతుడిని చేర్చు సాధనాలు!

  • సత్యము, ధర్మము ,ప్రేమ ,త్యాగము, తృప్తి ,సేవ ,ఓర్పు ఇదే దైవ గుణాలు!

  • నీటిలో పడవ ఉండాలి గాని పడవలో నీరు ఉండకూడదు! 

  • సంసారములో మానవుడికి కర్తవ్య బుద్ధి, దైవ బుద్ధి ఉండాలే గాని మమకార వ్యామోహ బుద్ధి ఉండకూడదు!

  • ధర్మయుతంగా నీవు దేనిని అనుభవించినా అది బ్రహ్మానందమే!

  • ద్వైత స్థితి అనగా భగవంతుడు వేరు– నేను వేరు అనే భావం!

  • తనకు తాను అనుభవించే స్థితి–అనుభూతి! 

  • మనసుకు, బుద్ధికి అతీతమైన స్థితి– అనుభూతి! 

  • మనసుతో అనుభవించే ధ్యానస్థితి– ధ్యాన అనుభవం! 

  • సంపద,అనునవి నిరంతరం మార్పు చెందే గుణం కలవి! 

  • మనోవేదన వలన పాపక్షయం అగును! 

  • పశ్చాత్తాపమునకు మించిన శిక్ష లేదు! 

  • ఆత్మ దర్శనం వలన ఆత్మ దర్శనానుభూతి కలుగుతుంది! 

  • ఆత్మసాక్షాత్కారం వలన ఆత్మానుభూతి కలుగుతుంది! 

  • భ్రుకుటి యందు జ్యోతి బిందువు దర్శనమే ఆత్మ దర్శనం!

  • జ్యోతి బిందువు యందు తన స్వస్వరూపాన్ని చూడడం ఆత్మసాక్షాత్కారం! 

  • ఆత్మ దర్శనానుభూతి వలన ద్వైత సిద్ధి వస్తుంది! 

  • బ్రహ్మానందానుభూతి వలన విశిష్టాద్వైత సిద్ధి వస్తుంది!

  • సవికల్ప సమాధి స్థితి వలన ఆత్మ దర్శనాననుభూతి కలుగుతుంది!

  • నిర్వికల్ప సమాధి స్థితి వలన ఆత్మానుభూతి కలుగుతుంది! 

  • ఆనంద స్థితి సమాధి స్థితి వలన బ్రహ్మానందానుభూతి కలుగుతుంది!

  • “నేను” అనేది త్యాగం చేసినప్పుడే పరిపూర్ణ గాన సిద్దుడు అవుతాడు!

  • ఆజ్ఞా చక్ర తత్వంలో ఆత్మ దర్శనం కలుగుతుంది! 

  • సహస్ర చక్ర తత్వంలో ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది! 

  • బ్రహ్మా రంధ్రము వద్ద విశ్వరూప సాక్షాత్కారం కలుగుతుంది! 

  • ఆత్మసాక్షాత్కారమును పరమాత్మ సాక్షాత్కారము లేదా బ్రహ్మ సాక్షాత్కారము అందురు!

  • విశుద్ధ చక్ర తత్వంలో ప్రారంభ సమాధి స్థితి కలుగుతుంది! 

  • ఆజ్ఞా చక్ర తత్వంలో సవికల్ప సమాధి స్థితి కలుగుతుంది! 

  • సహస్ర చక్ర తత్వంలో నిర్వీకల్ప సమాధి కలుగుతుంది! 

  • బ్రహ్మ రంధ్రం వద్ద ఆనంద సమాధి స్థితి కలుగుతుంది! 

  • ఆనంద సమాధి స్థితిలో కలిగే భావాలను దాటితే అప్పుడు తురియాతీతమైన స్థితి కలుగుతుంది! 

  • జీవుడు తాను ఏమిటో తెలుసుకోవడం ముక్తి! 

  • పరమాత్ముడు తనకు తాను ఏమిటో తెలుసుకోవడం మోక్షం!

  • ముక్తి వలన మరణానికి భౌతిక మరణం ఇచ్చును! 

  • మోక్షం వలన మరణానికి శాశ్వతమరణం ఇచ్చును! 

  • ముక్తి అనేది జీవుడు పొందుతాడు! 

  • మోక్షం అనేది పరమాత్ముడు పొందుతాడు! 

  • విశ్వంలో గాడ అంధకార శూన్యమే నిరాకార పరబ్రహ్మం! 

  • సత్ జ్యోతి స్వరూపమును పరమాత్మ అందురు !

  • ఆత్మ జ్యోతి స్వరూపమును ఆత్మ లేదా దైవం అందురు!

  •  విశ్వ శక్తి యొక్క రూపము విశ్వరూప దర్శనము! 

  • విశ్వంలోని శక్తిని విశ్వశక్తి అందురు! 

  • ఈ విశ్వశక్తి మహా కుండలినీ శక్తి లేదా చైతన్య శక్తి లేదా కాస్మిక్ ఎనర్జీ లేదా అయస్కాంత శక్తి లేదా రసాయనక శక్తి! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గ్రంథ పరిచయం

   అరుణాచల శివ పరమేశ్వరుడి లీల అనుగ్రహం  యోగ దర్శనం అంకితం : పరబ్రహ్మ స్వరూపులైన  పరమేశ్వరి , పరమేశ్వరుల  పాదారవిందములకు…. నా ఆది గురువైన శ్...