యోగ తత్వ బోధనలు

 

అర్జునా! తపస్సు కంటే–జ్ఞానుల కంటే–కర్మిష్టుల కంటే–యోగి చాలా గొప్పవాడు! కావున నీవు యోగివి కమ్ము! 

– భగవద్గీత 


కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలలో మానవుడు ఏం మార్గంలో పయనించినప్పటికీ చివరకు యోగమార్గాన్ని అవలంబించక తప్పదు. అప్పుడే జీవుడు జీవన్ముక్తుడై,  మోక్షాన్ని పొందుతాడు! 

– యోగ శాస్త్రాలు

 

కర్మయోగికి ప్రతీ కర్మ నందు దేవుడు ఉంటే….

భక్తి యోగి కి ప్రతి విగ్రహమునందు దేవుడు ఉంటే….

జ్ఞాన యోగి కి ప్రతి విషయ జ్ఞానమునందు దేవుడు ఉంటే….

యోగ మార్గమున నున్న యోగికి తన మనసే దైవంగా మారును! 

– పరమహంస


కర్మయోగులు శాస్త్రవిజ్ఞానులైతే 

భక్తి యోగులు మహా భక్తులైతే 

 జ్ఞాన యోగులు తత్వమసులైతే 

యోగమార్గముననున్న యోగులు పరమ గురువులగుదురు.

– పరమహంస 



ఏది కన్నులకు కనపడదో…

దేనివలన కన్నులు చూచుచున్నాయో…

అదియే భగవంతుడు!

– ఆగమ శాస్త్రాలు


మనిషి జన్మ లభించడం ఎంతో కష్టం…అది పొందాక ముక్తి పొందాలి అన్న కోరిక కలగడం చాలా కష్టం…

అది వచ్చాక సద్గురువు లభించడం అతి కష్టం….

ఈ మూడు ప్రక్రియలు దైవానుగ్రహం వల్లనే మాత్రమే లభ్యం అవుతాయి! 

– శిరిడి సాయిబాబా


గురు సేవకు దూరమైన వారు గంధర్వులైనను 

పితృదేవతలైనను, యక్షులైనను, ఋషులైనను, 

సిద్దులైనను, దేవతలైనను, సాధకులైనను, 

ముక్తిని పొందజాలరు!


– గురుగీత 


  • భగవంతుడొక్కడే సత్యము! ఈ జగమంతా మిథ్య! ప్రపంచంలోని కొడుకు, తండ్రి, భార్య, భర్త, తల్లి, ఆస్తులు అన్ని నశించినవే! 

  • అన్ని విషయాలలో అహంకారము, గర్వములను వదిలిపెట్టినచో నీవు ఆధ్యాత్మికంగా ముందుకు పోగలవు! 

  • కొందరు మాత్రమే జీవితకాలములో భగవంతుని సాక్షాత్కారమును పొందగలరు! 

  • నీవు ఎల్లప్పుడూ నా ధ్యానం చేయుచుండినా, నీ ఆలోచనలు నా యందు నిలిచి క్రమముగా నాలో ఐక్యం అయ్యేదవు! “నా” అనగా భగవంతుడు! 

  • వారి వారి ప్రారబ్దములను బట్టి ఒకరికి పంచామృతం ,ఒకరికి పులిసిన రొట్టె ,ఇంకొకరికి గంజి లభించును. ఏది తినినను తిరునది ఆకలే కదా!

  • నిన్ను నీవు సత్యాన్వేషిగా గుర్తించి శ్రద్ధతో ఆతురతతో, ప్రేమతో కూడిన భక్తిని అలవర్చుకొనుము!

  • మన ఇద్దరి మధ్యనున్న అహంకారం అనే అడ్డుగోడను తొలగించుము! అప్పుడు మన కలయిక సులభంగా జరుగగలదు! 

  • ఆశలను అదుపులో ఉంచు. ఆశలకు నీవు బానిస కావొద్దు. 

  • ధన చక్రంలో ఇరుక్కోవద్దు.  లోభత్వము విడువము.

  • తక్కువగా భుజింపుము. తక్కువగా నిద్రించుము. తెలుసుకునిన విషయములను చక్కగా గుర్తుంచుకొనుము. భగవంతున్ని ఎప్పుడూ మరచిపోవద్దు. 

  • ప్రాపంచిక విషయములను అనుభవించవచ్చును. కానీ వాటికి బానిస కారాదు. ఆశకు లొంగిన వారికి ముక్తి దొరకదు! 

  • బ్రహ్మ సాక్షాత్కారం కొరకు ఐదింటిని వదిలి వేయవలెను. కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం. 

  • జీవితంలో భగవంతున్ని తెలుసుకొనిన వారు చిరంజీవులు. వారు నిత్యసంతోషులు. మిగిలిన వారు బతికినంతవరకు ఉండి నశింతురు. 

  • ఎవరు భగవంతుడి యందు పూర్తి విశ్వాసముతో వారి లీలలను శ్రద్ధగా వినుచు, ఆలోచించుచూ, ఇతర విషయంలను ఆలోచించరో వారికి తప్పక ఆత్మసాక్షాత్కారం లభించును. 

  • ఎవరు అహంకారమును వదిలి దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచుతారో వారు అన్ని బంధముల నుంచి విముక్తి పొంది మోక్షం పొందగలరు. 

  • జ్ఞానం పొందుట అనగా అజ్ఞానం పోగొట్టుకొనుట అదే ఆత్మసాక్షాత్కారం. 

  • ఎవరు భార్య లేక పిల్లలు, తల్లిదండ్రులు గురించిన బంధములను మానసికంగా వదిలి భగవంతుడి యందే ప్రేమ కలిగి యుందురో వారు నదీ సముద్రం కలిసినట్లుగా భగవంతుడిలో ఐక్యమగుదురు. 

  • ఎవరు భగవంతుడి యందు సంపూర్ణ శరణాగతులైయెదరో…. ఎవరు భగవంతుడిని సంపూర్ణ విశ్వాసంతో పూజించెదరో…ఎవరు ఎల్లప్పుడూ భగవంతుడిని ధ్యానించెదరో వారిని అన్ని బంధముల నుండి విముక్తి కలిగించి ముక్తిని భగవంతుడు ప్రసాదించును. 

  • పరిశుద్ధమైన హృదయం నుంచి మాత్రమే వివేక వైరాగ్యం కలిగి ఆత్మసాక్షాత్కారం కలుగును. 

  • ఎవరు రాత్రి పగలు భగవంతుడిని ధ్యానించెదరో వారు తీపి పంచదార లాగా భగవంతుడు ఇచ్చునది శాశ్వతముగా నిలుచును. 

  • కృషిచేసి ఆత్మస్థితి తెలుసుకున్న వారు మాత్రమే ఆత్మనందమును అనుభవించగలరు. 

  • నీవు సాధన చేసి నీలోనే చైతన్య రూపమైన ఆత్మ శక్తి గుర్తించినచో నీకు అన్ని విషయాలు వాటి అంతట అవే అర్థం అవుతాయి. ఆ తర్వాత నీవు భగవంతుడిలో ఐక్యం అవుతావు! 

  • ఈ కాలంలో నిజమైన గురువు దొరుకుట చాలా కష్టం. కేవలం కాషాయదుస్తులు వేసే కపట గురువులు ఎక్కువగా పెరుగుతున్నారు. జాగ్రత్తగా పరీక్షించి తెలుసుకో. 

  • బాగా ఆలోచించము.  అసలు నీవెవరు? నీకు ధనం ఎందుకు ధనం కోసం ఇంత తాపత్రయం పడతావు ఎందుకు?  ఇదే ముముక్షువు అగుటకు కావలసిన అర్హత.

  • ఎవరు తాను బంధీనని ఆ బంధముల నుంచి తప్పించుకొను ప్రయత్నం నిర్విరామంగా దృఢనిశ్చయంతో చేస్తూ ,మిగిలిన విషయంలోను పట్టించుకొనడో వాడే ముముక్షువు.

  • మోక్షమార్గానికి అవసరమైన ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించి , పుస్తక జ్ఞానం ద్వారా సంపాదించి, ఫలితం పొందు.

  • మన ఇంద్రియములను శరీరపు బయట విషయము యందే శ్రద్ధ ఉండేటట్లుగా భగవంతుడు సృష్టించాడు .కానీ ఆత్మ జ్ఞానం కలగాలనుకునే మనిషి మాత్రం వీటి ద్వారా లోపల ఉన్న ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. 

  • నీవు నిజంగా దైవ భక్తునిగా మారాలంటే నవవిధభక్తి మార్గాలను తెలుసుకొని అందులో నీవు ఆచరించగల మార్గమును ఎన్నుకొని దాని ద్వారా భగవంతుడిని చేరుకొనవచ్చును.

  • భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తే వారికి మాత్రమే నిజమైన వివేక వైరాగ్యములు దైవ కృపచే కలుగును . వారు మాత్రమే అశాశ్వతమైన ఈ సంసారమును దాటగలరు.

  • మనము ఇదివరకు చేసిన కర్మే ఇప్పటి దుఃఖానికి గాని, సంతోషానికి గాని కారణం అవుతున్నది ఈ రెండింటిలో నీకు ఏది వస్తే దానిని సంతోషంగా స్వీకరించుము . ఇదే నిజమైన సాధకుడి లక్షణం. 

  • అపవిత్రమైన మనసుతో ఆధ్యాత్మిక కార్యములు ఎన్ని చేసినా కేవలం పేరు ప్రఖ్యాతులు తప్ప నీకు ఏ విధంగా ఉపయోగించవు. అందుకు ప్రతివాడు మనసును పవిత్రం చేసుకొనుట చాలా అవసరం. 

  • చెట్టు నిండా కాయలు ఉన్నప్పుడు అది వంగి ఉండును. అలాగే జ్ఞానం కలవాడి లక్షణం అలాగే ఉంటుంది. 

  • ఇతర స్త్రీలను గురించి పూర్తిగాను, నీ భార్య విషయంలో కూడా కొంతవరకు కామకోరికలను తగ్గించుకోను అప్పుడే కామాసక్తి తగ్గును. 

  • సత్సంగం అంటే మంచి మనుషులతో కలిసి ఉండుట . దుస్సంగం అంటే చెడువారితో కలిసి తిరుగుట నీవు సత్సంగంనే అలవాటు చేసుకో.

  • బ్రహ్మ జ్ఞానము ఆత్మజ్ఞానము అనునవి పదునైన కత్తి అంచు మీద సాము చేయుట లాంటిది.

  • ఆత్మ ఏ మనిషిని ఎన్నుకుంటుందో వారికి మాత్రమే ఆత్మ తన స్వరూప, స్వభావాలను తెలియపరుచును. 

  • ఆత్మను గుర్తించి జ్ఞానము విచిత్రంగా ఉండి తెలుసుకోవడానికి కష్టంగా ఉంటుంది . తమంత తాముగా ఎవరు ఆత్మను ఆత్మశక్తిని తెలుసుకోలేరు.  స్వయంగా ఆత్మ శక్తిని తెలుసుకొనిన సద్గురువు తప్పక అవసరం. 

  • తెలివైన వారు మంచి విషయాలను కోరుకుంటారు. తెలివి తక్కువ వారు మాత్రమే కోరికలకు బంధాలకు లొంగి కేవలం సంతోషము కలిగించు విషయాలను కోరుకుంటారు. అందువలన వీరు బ్రహ్మ జ్ఞానము గాని ఆత్మసంధానమును గాని చేయలేరు. 

  • నేను ఈ శరీరం అనే భావన ఒట్టి భ్రమ. ఆ భావనతో కూడిన ఆలోచనలన్నీ మనిషికి బంధాలే. అందువలన ఆత్మజ్ఞానం పొందాలనుకునే వారు ఆ భ్రమను, ఆ బంధాలను వదులుకోవాలి.  అనగా మానసికంగా వదిలిపెట్టాలి. 

  • ఈ శరీరం ఒక రథం! ఆత్మ దాని యజమాని . తెలివి రథసారథి .ఇంద్రియాలు గుర్రాలు కాబట్టి ప్రతి సాధకుడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి .లేదంటే ముఖ్య లభించదు.

  • ధనము మీద వ్యామోహం అనేది అగాధమైన సముద్రం లాంటిది మోసము, అసూయ అనే మొసళ్ళు దీనిని నిండా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. అందుకు జాగ్రత్త వహించవలెను. 

  • ఈ ప్రపంచము నందలి వస్తువులు అన్నియు నశించునవే సందేహం లేదు. కానీ ఈ ప్రపంచంలో ఉన్నంతవరకు తనం అవసరమే .కానీ ధనముయందు వ్యామోహం ఉండరాదు ..అవసరమైనంతవరకే ధనం సంపాదించాలి.

  • ప్రపంచ విషయాల మీద, సంపాదన మీద ,గౌరవ మర్యాదలు మీద, హోదాల మీద ,విరక్తి చెందితే గాని ఆత్మ జ్ఞాని కాలేడు.

  • నీతి ,నిజాయితీలు, అంతర దృష్టి ,పవిత్రత ,ఆరాధనలు కలవాడికి  మాత్రమే ఆత్మసాక్షాత్కారం లభించును. 

  • అహంకార ,మమకారములు తొలగిపోయి, మనస్సు కోరికలు లేని పరిశుద్ధత కలిగి ఉంటే గాని ఆత్మ జ్ఞానం కలుగును. 

  • అన్ని విషయాల యందు విరక్తి ,వైరాగ్యాలు కలిగి ఉండుట బ్రహ్మజ్ఞానమునకు చేరుటకు మార్గం. 

  • స్త్రీ (పురుషుడు), సంపద అను ఈ రెండు ఆధ్యాత్మిక జీవితంలో వచ్చే పెద్ద అడ్డంకులు .తస్మాత్ జాగ్రత్త!

  • నీ హృదయం పవిత్రంగా ఉన్నంతవరకు నీకు ఏ కష్టములు ఉండవు. మనలో ఏ పాపపు ఆలోచనలు లేనంతవరకు మనము ఎవరికి భయపడవలసిన పనిలేదు. 

  • మనం ఎప్పుడూ సూటిగా, నీతిగా ,పవిత్రంగా ఉండాలి.  మనం మంచి ,చెడు విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలి . మనం ఎప్పుడూ మన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉండాలి.

  • యోగము ,త్యాగము ,జ్ఞానము, భక్తి ఇది భగవంతుడిని చేరు సాధనములు. తృప్తి ,సేవ ,ఓర్పు, అనేవి ఆధ్యాత్మిక పురోగతి సాధనములు. ఆశ ,కోపము, అహంకారము, స్త్రీ మరియు సంపద అనేవి ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకాలు.

  • కష్టాల్లోనూ ,సుఖాల్లోనూ చలించకుండా ఉన్నవాడే ధీరుడు. అటువంటి వ్యక్తి మాత్రమే అమృత తత్వాన్ని చేరుకోగలడు.

  • నీకు నీవే ఆప్తుడివి, నీకు నీవే శత్రువు వి ,నీకు నీవే శిక్షణ ఇచ్చుకుంటే నీకు నీవు అధిపతివి అవుతావు!

  • జ్ఞానులు ,అజ్ఞానులు జీవితాన్ని వేరువేరు దృక్పథాలతో చూస్తారు అజ్ఞానీ తన సుఖమే ధ్యేయంగా పనిచేస్తాడు . అదే జ్ఞాని  లోకం కోసం కష్టపడతాడు. 

  • చావు పుట్టుకలు సహజం .ఎవరు తప్పించుకోలేరు. వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు!

  • కర్మయోగి తన బాధ్యతలన్నీ ఇతరుల కంటే సమర్థంగా నిర్వర్తిస్తాడు.  అతనికి కర్మయే ఉపాసన.  కర్మను మించిన పూజ లేదని భావిస్తాడు!

  • శ్రద్ధ లేకపోతే అంతా నాశనం అవుతుంది. తద్వారా మనసు కలుషితం అవుతుంది.!

  • లాభాల్లో, నష్టాల్లో, కష్టాల్లో ,సుఖాల్లో నీ మనసును అటు ఇటు పరిగెత్తనీయకు . సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా స్థిరంగా ఉంచు. ఆ స్థిరమైన మనసుతో ధ్యానం చేయి!

  • నీకు అప్పగించిన బాధ్యతలన్నీ శక్తినంతా ధారపోసి సమర్థంగా నిర్వహించు.  నిన్ను ఎవరు  పర్యవేక్షించాల్సిన అవసరమే రాకూడదు . ఎవరి పనిని వారు నేర్పుగా చేయడమే యోగము!

  • ఐహిక విషయాలు గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటే, వాటి పట్ల ఆకర్షణ కలుగుతుంది.  ఆకర్షణ వల్ల కోరిక పుడుతుంది . కోరిక వల్ల కోపం పుడుతుంది.  కోపం వల్ల అవివేకం ఆవరిస్తుంది.  ఈ అవివేకం వలన మతిభ్రమిస్తుంది. ఈ ఫలితంగా బుద్ధి నశిస్తుంది.  బుద్ధి నశిస్తే, సమస్తం నాశనమైనట్టే!

  • ధర్మము ,అర్థము ,కామము మీ స్వయంకృషి వలన మీరు పొందవచ్చును .మోక్షం మాత్రం సద్గురువు సహాయం లేనిదే మీరు పొందలేరు.

  • ఆశ పాశములతో పాటు అన్ని సంబంధాలను తెంచుకొని, భిక్షా పాత్రను చేత పట్టుకొని మనస్పూర్తిగా భగవంతుని ధ్యానిస్తూ సన్యసించు.

  • దుఃఖమునకు ప్రధాన కారణములు భయము, తీరని కోరికలు!  చావు అనేది “ మిథ్య “ అని తెలియగానే మరణ భయం పోతుంది . భయము, దుఃఖము లేనిచో సర్వం ఆనందమయమే అవుతుంది.

  • రాత్రుళ్ళు యందు ముగ్గురు మాత్రమే జాగరణ చేస్తారు.  అరే యోగులు ,బోగులు, రోగులు. 

  • ఎవరూ తమ జీవితాన్ని ధ్యానమయం చేస్తారో వారు యోగులు. ఎవరు తమ జీవితాన్ని భోగమయం చేస్తారో వారు రోగులు. ఎవరు తమ జీవితాన్ని విజయవంతమయం చేస్తారో వారు భోగులు. 

  • బ్రహ్మమును దర్శించడానికి అనేక సాధనలు ఉన్నాయి. అన్నింటికంటే శ్రేష్టమైన సాధనం ధ్యానం.

  • ఈశ్వర అనుగ్రహం వలన జీవునికి శమదమాధి గుణములతో కూడిన జన్మ లభించును . అట్టి దైవగుణములు గల జన్మయందే ఆత్మజ్ఞానం కలుగును.  అట్టి జ్ఞాన అనుభూతిచే జీవన్ముక్తి లభించును.

  • ఈశ్వర కృప కలిగితే గాని సద్గురు కృప కలుగదు. సద్గురు కృప కలిగితే గాని ఆత్మసాక్షాత్కారం కలుగదు .ఆత్మసాక్షాత్కారం కలిగితే గాని ముక్తి కలుగదు!

 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గ్రంథ పరిచయం

   అరుణాచల శివ పరమేశ్వరుడి లీల అనుగ్రహం  యోగ దర్శనం అంకితం : పరబ్రహ్మ స్వరూపులైన  పరమేశ్వరి , పరమేశ్వరుల  పాదారవిందములకు…. నా ఆది గురువైన శ్...