యోగ సారములు
1) యోగసారము వివరించండి?
నిష్కామ కర్మాచరణముచే చిత్తమును శుద్ధ మొనర్చుకొని,
పరమాత్మయందు అచంచలమైన భక్తిని కలిగియుండి..
ధైర్యముతో మనస్సును స్వాధీనపరుచుకొని...
శబ్దాది విషయాలను, రాగద్వేషములను విడిచిపెట్టి...
సాత్త్విక దైవార్పిత మితాహారమును స్వీకరించుమా...
శరీర వాఙ్మనంయిలను నియమించి, వైరాగ్యమును లెస్సగా ఆశ్రయించి
ధ్యానయోగపరుడై అహంకార దర్పాదులను... కామ, క్రోధాలను, భోగ్య వస్తు పరిగ్రహమును బాగుగా తృజించి...
మమకార రహితుడై, శాంతి స్వభావము, కలిగియుండువాడు బ్రహ్మ సాక్షాత్కారమును తప్పక పొందును.
2) గీతాసారము వివరించండి?
జరిగినది మంచే జరిగినది.
జరుగుతున్నది మంచే జరుగుతుంది..
జరుగబోయేది గూడ మంచే జరుగుతుంది.
నీది ఏది పోయిందని నీవు రోదిస్తున్నావు.
నువ్వు తెచ్చింది ఏమిటని నువ్వు పోగొట్టుకోవటానికి,
నువ్వేది తీసుకొన్న ఇక్కడ నుండే తీసుకొన్నావు.
ఇచ్చినదంతా ఇక్కడనించే ఇచ్చావు.
ఈ రోజు నీది అనే ఆ వస్తువు.
నిన్న మరొకరిది. ఎల్లుండి వేరొకరిది అవుతుంది.
3)మాతాపితలను గూర్చి తెల్పండి?
మరిచిపోయిన వేరే అందరిని,
అమ్మా, నాన్నలను మరువకు
పరమ హితైషులు వారే
నీకని మరువకు మరువకు.
నిన్ను కనాలని పూజలు చేశారెన్నో దేవుళ్లకు,
నీవే రాయై, వారల గుండెలు ముక్కలు చేయకు.
గోరు ముద్దలు కొసరి కొసరి పెట్టిపెంచారు
నిన్ను అమృతం నీకందించిన వారిపై విషం కక్కుకు.
ముద్దు మురిపెం చేసి తీర్చారెన్నో కోరికలు.
ఆ ప్రేమమూర్తుల ఆశలు కూడ తీర్చాలని మరవకు.
లక్షలు, కోట్లు గడించిన అవి నీ తల్లిదండ్రులకు దీటుగావు.
తడిసిన చోటే నడుంవాల్చి, పొడిగా ఉందారు
నిన్ను అమృతం కురిసే అమ్మ కళ్లలో ఆశ్రువులతో తడపకు.
నువ్వు నడిచిన చోటల్లా పరిచారు పూలు.
ఆ మార్గదర్శి దారిలో నువ్వే ముళ్ళై బాధించకు. ధనం పోతే పొందవచ్చు.
దొరకదు తల్లిదండ్రుల ఆచరణ కమలాల పవిత్రత అని జీవితాంతం మరువకు.
ఆలి కన్నా తల్లి మిన్న అని
ఆలిపోతే నీకు మరో ఆలి దొరుకును !
గాని తల్లిపోతే....నీకు మరో తల్లి ఉండదు.
ఆ దైవ స్వరూపాలకు సేవ చేసినట్లే!నీ భార్య, బిడ్డలను నీవు నిర్ణయిస్తే....
నీ తల్లిదండ్రులను ఆ దైవము నిర్ణయించును. అందుకని....
నీ తల్లిదండ్రులను ఎన్నటికీ మరువకు!
వారి ఆగ్రహమునకు ఎన్నటికీ గురికాకు!
వారి అనుగ్రహమునకు తాపత్రయపడు!
లేదంటే....
తల్లిదండ్రుల యోగమాయలో
పడినవాడు.....
గృహస్థుడు అవుతాడు!
అదే....
ఈ తల్లిదండ్రుల మహామాయను
చేధించినవారు
యోగసాధకుడు అవుతాడు!
అదే...
తల్లిదండ్రులు, భార్యపిల్లల యోగమాయలను చేధించినవాడు...
యోగి అవుతాడు!
అలా...
కపోతాలు తమబిడ్డలకోసం
వేటగాడి వలలో పడిన తాపత్రయం చూడు....
ఈ మానవ దేహం ముక్తికి
దూరము చేసే ఈ మమకారాల మహామాయను చూడు...
ఈ మాయను చేధించినవాడు
జీవన్ముక్తిని పొందుతాడు!
లేదంటే గృహస్థ ధర్మానికి అంకితమై...
ముక్తికి దూరమవుతాడు!
బుద్ధుడు దగ్గర నుండి శంకరాచార్యుల వరకు
రామకృష్ణ పరమహంస దగ్గర నుండి రాఘవేంద్రస్వామి
వరకు ఇలాంటి మహామాయలను చేధించినవారే!
అందుకే వారు ముక్తిని పొందినారు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి